బ్లాక్ ఫంగస్ - యాంటీ బయోటిక్స్ కారణమా ?

Telugu Lo Computer
0


ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరగడానికి యాంటీ బయోటిక్స్ కారణంగా కనిపిస్తున్నాయని రాజీవ్ జయదేవ్ అనే డాక్టర్ అభిప్రాయపడుతున్నారు. ఇండోర్ కి చెందిన మహాత్మా గాంధీ స్మారక వైద్య కళాశాలలోని మెడిసిన్ విభాగాధిపతి ప్రొఫెసర్  విపి పాండే 210 మంది బ్లాక్ ఫంగస్ రోగులపై చేసిన అధ్యయన వివరాలను రాజీవ్ జయదేవ్ అనే వైద్యుడు టిటర్లో పెట్టాడు. 

ఇప్పటి వరకు స్టెరాయిడ్స్ ను వీక్షణారహితంగా వాడటం వలనే కరోనా రోగులలో  బ్లాక్ ఫంగస్ వైరస్ రావడానికి కారణమని పలువురు వైద్య నిపుణులు పేర్కొంటున్న నేపద్యములో ఈ కొత్త విషయం బయటపడింది. ఈ అధ్యయనం ప్రకారం బ్లాక్ ఫంగస్ వైరస్ సోకిన వారిలో 14 శాతం మంది   స్టెరాయిడ్స్ ఉపయోగించలేదు. 21 శాతం మందికి మధుమేహం లేదు. 36 శాతం మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. 52 శాతం మంది మాత్రమే బయటి నుండి ఆక్సిజన్ తీసుకున్నారు. జింక్ వినియోగంపై ఇందులో అధ్యయనం చేయలేదు. దీనినిబట్టి చూస్తే ఈ ఇన్ఫెక్షన్ తలెత్తడానికి  స్టెరాయిడ్స్, మధుమేహానికి మించి ఇతరత్రా కారణాలు ఉన్నట్లు కనిపిస్తుందని పేర్కొన్నారు. ఈ రోగులు వంద  శాతం యాంటీ బయోటిక్స్ తీసుకునట్లు అధ్యయనం తెలుస్తోంది.  రోగులకు సూచించిన మందులలో అజిత్రోమైసిన్, డాక్సి సైక్లిన్, కార్బపెనెమ్స్ లాంటివి కనిపించాయి. అందువలన యాంటీ బయోటిక్స్ కారణంగా కనిపిస్తున్నాయని డాక్టర్  రాజీవ్ జయదేవ్ అభిప్రాయపడ్డారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)