ఆరోగ్యశ్రీలో బ్లాక్ ఫంగస్

Telugu Lo Computer
0

 

బ్లాక్ ఫంగస్ (మ్యుకర్‌ మైకోసిస్‌) చికిత్సను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొస్తూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఏకే సింఘాల్ ఆదేశాలు జారీచేశారు. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ కావడంతో ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.  ఇప్పటికే కరోనా చికిత్సను ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకం కింద అందిస్తోన్న విషయం విదితమే.  ఇప్పటివరకు తొమ్మిది బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున  వెలుగుచూశాయి.

విశాఖలో  బ్లాక్ ఫంగస్ రోగుల చికిత్స కోసం కెజిహెచ్ లో పడకలను ఏర్పాటు చేశారు. డెర్మటాలజీ విభాగంలో 20  పడకలను కేటాయించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)