కాఫీ...... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Header Ads Widget

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 19 May 2021

కాఫీ......

 

ఉషొదయాన కాఫీ సేవిస్తుంటే ఇంత రుచికరమైన కాఫీ మీద వ్రాద్దామనిపించింది.

కాఫీ, టీ ఒక్క పోలిక నుండు - చూడ చూడ రుచులు జాడ వేరు.
అన్ని రుచుల యందు కాఫీ రుచి వేరయా- విశదముగ వివరింతు వినతులారా !
వేడి నీటిలో వేగమే పొడి వేసి -చిక్కని డికాక్షను తీసి, పాలు-చెక్కెర కలిపితే కమ్మ నైన కాఫీ.
అలసటను తరిమి హుషారునిచ్చే కాఫీ.
రోగమొస్తే నోటి కి హితవు నిచ్చే కాఫీ.
భర్త మెప్పు పొందే తరుణోపాయము కాఫీ.
రుచికరమైన కాఫీ తో రవ్వల నెక్లెస్ నజరానా.
పట్టు చీర కావాలంటే పడతి పట్టుకొస్తుంది కాఫీ.
కాపీ రాగములో కూని రాగములు ఎన్నో?
వ్యాపార మంతనాలు వేగముగ జరుగు కాఫీ తో.
ప్రేమించే మనసులకు కాఫీ ఒక దిక్సూచి.
శత్రువులను మిత్రులుగ చేయను మంచి కాఫీ.
కమ్మనైన కాఫీ తో కవిత్వమెంతో వచ్చు.
బుల్లెట్, బ్లాక్, చాక్లెట్, బ్రూ, ఫిల్టరు కాఫీలు వేరయా.
స్ట్రెంతు నిచ్చు ఇన్స్టెంటు కాఫీ వేరయా.
కోటీశ్వరులను చేస్తుంది కాఫీ వ్యాపారము.
కమ్మని కాఫీ తో అందమైన కోరికలు జనించు.
ఆహ్లాదకరమైన కాఫీ తో ఆరోగ్యము వచ్చు.
తరతరాల తరగని చరిత కలది కమ్మ ని కాఫీ.
జగమెల్ల ఫిదా అగును కాఫీ కి.
మాయా మర్మములు ఎరుగనిది కాఫీ.
మనసెరిగన కాఫీ - మహిమ కల కాఫీ.
సుదతి మెచ్చే కాఫీ - సుగుణ మైన కాఫీ.
కాఫీ త్రాగుతుంటే - కనిపించును స్వర్గం.
కాఫీ చరిత్ర వింటే - వస్తుంది మోక్షం.

No comments:

Post a Comment

Post Top Ad