మందు మంచిదే!

Telugu Lo Computer
0

 

కరోనా రోగులకు ఇచ్చే ఆనందయ్య మందులో హానికరమైన పదార్ధాలు ఏమీ లేవని ఆయుష్ విభాగం తెలిపింది. ఈ మందు కోసం 18 రకాల వనమూలికలను వాడినట్లు తెలిపింది. అయితే దీనిని కోవిడ్ ముందుగా పరిగణించలేమని, నాటు మందని అవమానించ అవసరం లేదని ఈ మందు వలన ఎక్కువ మందికి లబ్ది జరిగిందని ఎక్కువ మంది చెబుతున్నారని ఆయుష్ కమీషనర్ రాములు మీడియాకు వెల్లడించారు. 70 వేల నుండి 80 వేల మంది వరకు ఈ మందును పంపిణి చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారని, అంతమందికి పంపిణీ చేయడం వలన ఒకరిద్దరికి సమస్యలు వచ్చి ఉండవచ్చు. మందులో వాడే పదార్ధాలన్నీ ఆయుర్వేదం అంగీకరించినవే. కానీ ఆయుర్వేద ముందుగా గుర్తించాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. క్లాసికల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ పుస్తకాలలో లేని మందు ఏదైనా క్లినికల్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది. ఏ మోతాదులో ఆ పదార్ధాలు వాడుతున్నా రనేది ముఖ్యమేనని అన్నారు. కంటిలో వేసే చుక్కలపై కొన్ని అనుమానాలు వున్నాయని, అవి తొలగిపోయిన తరువాత దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. గ్రామస్తులను విచారించిన తరువాత కరోనా కేసులు తక్కువగా వున్నాయని, కరోనా మరణాలు కూడా ఉన్నాయని తెలిసిందన్నారు. పూర్తి వివరాలు ముఖ్యమంత్రికి వెల్లడించామని, మరో నాలుగు రోజులలో నివేదికను అందజేస్తామని రాములు అన్నారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)