చిన్నారుల్లో కరోనా!

Telugu Lo Computer
0

 

గతే డాదితో పోలిస్తే రూపాన్ని మార్చుకున్న కరోనా, ఇప్పుడు ఎక్కువ మందిని బలి తీసుకుంటోంది. మొదటి దశలో మహిళలు, చిన్నపిల్లలపై వైరస్ పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో పిల్లలు, యువత ఉండటం ఆందోళనకరమైన అంశం. ఈసారి యుక్తవయసు వారిపై కూడా వైరస్ తీవ్రమైన ప్రభావం చూపుతోందని కేసులను పోల్చి చూస్తే తెలుస్తోంది. అయితే రెండో దశ కరోనా యువతకు ఎక్కువ ప్రమాదకరంగా మారుంతోందనే వాదనకు ఎలాంటి ఆధారాలు లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) తెలిపింది. ఈసారి ఎక్కువ మంది పిల్లలకు వైరస్ సోకుతోంది. చాలామందిలో తీవ్రమైన వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. పిల్లల్లో వైవిధ్యమైన వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈసారి దగ్గు, జలుబు, జ్వరం కాకుండా డయేరియా, కడుపు నొప్పి వంటి లక్షణాలతో వైరస్ వ్యాపిస్తోందని నిర్ధారిస్తున్నారు. ఇలాంటి కేసులను వివిధ రాష్ట్రాల్లో గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో పదేళ్ల లోపు పిల్లల్లో చిన్నపాటి కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. పదేళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారిలో సాధారణ జ్వరం, ఇతర లక్షణాలు బయట పడుతున్నాయి. ఇవి రెండు, మూడు రోజుల పాటు కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)