మేలు చేసే జింక్

Telugu Lo Computer
0


యాంటీబాడీలలో కీలకంగా వ్యవహరించే జింక్, తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేయడంతో పాటు, వైరస్ తో పోరాడే రోగ నిరోధక వ్యవస్థ పని తీరులో ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. శరీరంలో జింక్ లోపించడం వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశము ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వ్యాధి నిరోధక శక్తిని దెబ్బ తీస్తాయి. జింక్ ను రోజు తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడం లో ఇతర మందులతో పాటు జింక్ తీసుకోవడం వలన ఎంతగానో ఉపయోగం ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

 సార్స్ కోవ్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే ప్రమాదాన్ని, తీవ్రతను జింక్ తగ్గించగలదని    అడ్వాన్స్ ఇన్ ఇంటిగ్రేటివ్ మెడిసన్ జర్నల్ కధనంలో పేర్కొన్నారు. పురుషులకు రోజుకు 14 ఎంజి, స్త్రీ లకు 11 ఎంజి జింక్ అవసరం. గింజ ధాన్యాలు, పాలు, పెరుగు, మజ్జిగ, మాంసం వంటి వాటిలో జింక్ లభిస్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)