కంటి కణాలకు ముప్పు !

Telugu Lo Computer
0

 

కరోనా కంటి నుంచి శరీరంలోకి సులభంగా ప్రవేశించి క‌ణాల‌ను నాశనం చేస్తుందని గుర్తించారు. అమెరికాకు చెందిన మౌంట్‌ సైనాయ్ ఆసుప‌త్రి ఆధ్వర్యంలో ఈ కొత్త అధ్యయయ‌నం జ‌రిగింది. కంటిలోని స్రావాలను ఆధారంగా చేసుకుని వైరస్‌ శరీరంలోకి ప్రయాణిస్తుందని తేల్చారు. కంటిలోని కణాల నాశనం చేయడమే కాకుండా ఈసిఈ 2 ద్వారా వైరస్‌ శరీరంలోకి చేరుతుందని పరిశోధకులు కనుగొన్నారు. కంటిలోని ముందు భాగమైన లింబస్‌ వైరస్‌కు ఎక్కువగా ప్రభావితమ‌వుతోంద‌ని,  కార్నియాకు తక్కువ ముప్పు ఉంటుందని తెలిపారు. ముఖంలోని ప్రతి భాగం వైరస్‌ను శరీరంలోకి పంపేందుకు వాహకంగా మారుతుంద‌ని, తరచూ చేతులు శుభ్రపరచుకోవాలని, ముఖం, క‌ళ్లు, నోరు  తాకకుండా ఉండం మంచిదని అంటున్నారు. 

ఫేస్‌ షీల్డ్‌ల వాడకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. రెండు మాస్క్‌లు ధ‌రించ‌డంతోపాటు ఈ ఫేస్ షీల్డ్‌ల‌వ‌ల్ల ఎదుటివారి నుంచి వ‌చ్చే నోటి తుంప‌ర్లుకానీ, గాలికానీ, క‌ళ్ల‌ద్వారాకానీ వ‌చ్చే వైర‌స్ వాహ‌కాల నుంచి ర‌క్ష‌ణ ఉంటుంద‌ని, ఇది క‌చ్చితంగా అంద‌రూ ఉప‌యోగించాల‌ని అధ్య‌య‌నంలో పాల్గొన్న శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)