పోర్టబుల్ వెంటిలేటర్

Telugu Lo Computer
0

 


అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ... సీఎస్ఐఆర్, నేషనల్ ఏరోస్సేస్ ల్యాబ్స్ సహకారంతో  పోర్టబుల్ వెంటిలేటర్ ను రూపొందించింది.  'స్వస్థ్ వాయు ఇన్వాజివ్ వెంటిలేటర్' గా దీనికి పేరు పెట్టారు.   బ్రీఫ్ కేసు పరిమాణంలో వుండే ఈ వెంటిలేటర్ మూడు కిలోల కన్నా తక్కువ బరువు ఉంటుంది. దీనిని  ఇంటిలో కూడా వాడుకోవచ్చు. 

హైదరాబాదుకు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ అధినేత బద్దం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాదుతో పాటు బెంగళూరు నగరంలోనూ ఈ మినీ వెంటిలేటర్ ను ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్టు,  కరోనా బాధితులే కాకుండా  శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు,  ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నవారు  కూడా ఉపయోగించవచ్చని తెలియజేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)