రెండో దశకి జులైలో తెర !

Telugu Lo Computer
0

 

కరోనా రెండో దశకి జులైలో తెర పడే అవకాశాలు ఉన్నట్లు, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ పరిధిలోని సైన్స్, టెక్నాలజీ విభాగం ఏర్పాటు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తల బృందంలోని ఒకరైన కాన్పూర్ ఐ ఐ టి కి చెందిన ప్రొపెసర్ మనీందర్ అగర్వాల్ తెలియజేశారు. "సూత్ర" (ససెప్ట్ బుల్, అన్ డిటెక్టెడ్, టెస్టడ్ (పాజిటివ్) అండ్ రిమూవుడ్ అప్రోచ్) అనే మోడల్ ద్వారా శాస్త్రవేత్తల బృందం పలు అంచనాలకు వచ్చింది. రోజువారీ కేసులు మే నెలాఖరుకల్లా లక్షా 50 వేలకు చేరుతుందని, జూన్ ఆఖరినాటికి 20 వేలకు తగ్గుతుందని ఈ బృందం అంచనా వేసింది. 

సూత్ర ప్రకారం అక్టోబర్ వరకు మూడో దశ ఉండక పోవచ్చునని, మూడో దశ  స్థానికంగానే ఉంటుందని, వ్యాక్స్నేషన్ కారణంగా ఎక్కువ మంది దీనికి ప్రభావితం కాకపోవచ్చునని మనీందర్ అగర్వాల్ అన్నారు. దేశంలో రెండో ఉద్ధృతి తీరును ముందుగా అంచనా వేయలేక పోయినట్లు కమిటీ అంగీకరించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)