జీవితం...... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Friday, 21 May 2021

జీవితం......

 

రోడ్డు వార చిన్న బడ్డీ కొట్టు. ఉదయం అయిదు గంటలకల్లా సూర్యారావు భార్య గన్నెమ్మతో బయలుదేరి వచ్చి ఇడ్లీ, బజ్జీ, వడ అమ్మకంతో దినచర్య ప్రారంభిస్తాడు. తిరిగి సాయంత్రం వచ్చి మిరప, అరటికాయ బజ్జీలు వేసి అమ్మకమయాక మర్నాటికి కావలసిన సరుకులు కొనుక్కుని ఇంటికి చేరుకుంటాడు. 

ముగ్గురు పిల్లలు. మగపిల్లవాడు ఇంటర్ మొదటి సంవత్సరం, తర్వాత ఇద్దరుఆడపిల్లల్లో పెద్ద పిల్ల సూర్యకళ పదో తరగతి, రెండవ పిల్ల చంద్రకళ తొమ్మిదో తరగతి చదువుతున్నారు. 

సూర్యకళ చక్కని చుక్క అని చెప్పవచ్చు. సెలవురోజుల్లో పిల్లలు కొట్టు వద్దకు వచ్చేవారు. తినడానికి వచ్చిన వాళ్ళు తింటూ సూర్యకళను చూపులతో తినేసేవారు. చాలా బిజీగా ఉన్న సూర్యారావు గన్నెమ్మలు ఇవేవీ గమనించేవారు కాదు.  

వచ్చిన వాళ్ళలో శ్రీను అనేవాడు సూర్యకళను చేజిక్కించు కోవాలని ప్రణాళిక వేసుకొన్నాడు. సూర్యకళను స్కూల్ దగ్గర మాటేసి పలుకరించాడో రోజున. బడ్డీ దగ్గర అతనిని చూసి ఉండడం వలన మాటలోమాట కలిపింది. 

రోజూ స్కూల్ వదిలే సమయానికి వచ్చి పరిచయం కాస్త 

తన మీద ప్రేమ కలిగే విధంగా కబుర్లు చెప్పి ఆమెను నమ్మించాడు. అతని తీయని మాటలకు మోసపోయింది. 

పెళ్లికి ఇంట్లో ఒప్పుకోరేమోనన్న భయంతో అతనితో  ఓ అర్ధరాత్రి వెళ్ళిపోయింది. ఆ పిల్లకు తెలియని విషయం శ్రీనుకు ఇదివరకె పెళ్ళయిందని...వాడుకుని వదిలేశాడు. 

ఆడపిల్ల...ఒంటరిగా  ఎక్కడకని వెళ్తుంది! ఎలా బ్రతుకుతుంది! భయపడుతూనే  ఇంటికి తిరిగి వచ్చింది. తండ్రి రెక్కపట్టుకుని బయటకు గెంటేశాడు. కాళ్ళావేళ్ళా పడి బ్రతిమాలింది, ఏడ్చింది. 

గన్నెమ్మ కళ్ళల్లో నీళ్లూరుతున్నాయి. కాని... నిస్సహాయస్థితి. వారంరోజులై వెళ్లి ఇప్పుడు తిరిగొచ్చిన పిల్లను లోపలకు రానిస్తే చుట్టుపక్కల జనం ఈటెల్లాంటి మాటలతొ తమని బ్రతకనిస్తారా? చిన్న దానికి  పెళ్ళవుతుందా? గన్నెమ్మ మనసులో ఆలోచన్లతో సతమతమవుతోంది. 

"అమ్మా!" అంటు కాళ్ళను చుట్టేసుకున్న పిల్లను నెమ్మదిగా విడపించుకుని లోపలకు నడిచి తలుపు మూసేసుకుంది. 

"లోపలకు రానివ్వమ్మా." తలుపులు బాదుతూ ఏడుస్తోంది బయట సూర్యకళ. గన్నెమ్మ లోపల ఏడుస్తోంది. 

చుట్టుపక్కల జనం ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. చీకటి పడింది. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోయాయి. 

అర్థమయింది చంద్రకళకు. తనకిక ఈ ఇంట్లో స్థానం లేదని. 

లేచి నెమ్మదిగా అక్కడ నుంచి బయటకు దారి తీసింది. 

గన్నెమ్మ రాత్రంతా ఏడుస్తూనే నిద్రలోకి జారుకుంది. 

సూర్యారావు సమాజానికి భయపడ్డాడే  తప్ప పిల్లమీద ప్రేమలేక కాదు. అతనికి కూడ నిద్ర కరువయింది దుఃఖంతో. 

రాత్రంతా నిద్ర లేక తెల్లవారు జామున కునుకు పట్టిన వాళ్ళిద్దరికి తలుపులు దబదబమన్న శబ్దానికి మెలుకువ వచ్చింది. పక్కింటి గుర్నాదం పిలుస్తున్నాడు. 

తలుపు తీసిన సూర్యారావుతో చెప్పిన విషయం విని గన్నెమ్మ గుండెలు బాదుకుంటూ పరుగుతీసింది బయటకు. 

సూర్యకళ ఊరిబయట మర్రి చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. 

దగా చేసిన శ్రీను, లోకానికి వెరచి మమకారాన్ని చంపుకున్న తల్లిదండ్రులు, ఇదంతా వింటూ చూసి పట్టించుకోని ఇరుగుపొరుగు వారు ఒక్క సారి ఆలోచిస్తే .... 

మొగ్గగా ముగిసి ఉండేది కాదు ఆమె జీవితం. 

No comments:

Post a Comment

Post Top Ad