నిష్కల్మష ప్రేమ... నిర్మల భక్తి..... - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Looking For Anything Specific?

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

ad

Wednesday, 19 May 2021

నిష్కల్మష ప్రేమ... నిర్మల భక్తి.....

 

ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.

ఆ పిల్లలిద్దరు హుండీలోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.

అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.

రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లులేసుకొని చూస్తున్నాడురా అన్నాడు.

ఇద్దరు అరుణాచలునికి ఎదురుగా నిలబడి మా దొంగతనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లంలో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఒడంబడిక  అన్నారు.

ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యంగా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం  మాయమవుతోంది.

ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారికి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల  పసి పిల్లలు, వీళ్లను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలు మీరు ఇద్దరు అంతరాలయంలో 108 ప్రదక్షిణలు చేయండి, ఇదే మీకు  శిక్ష అన్నాడు.

పిల్లలు ఇద్దరు ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృల్లి పడ్డారు. పరిశీలించి పిల్లల్ని మరొకసారి  చూశారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూశారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు, మాటిమాటికీ మాయమవుతున్నాడు. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని  గట్టిగా వాటేసుకున్నాడు.

అంతే !

మూడవ పిల్లవాడు కాంతిరేఖగా మారి, గర్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.

అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు కూడా వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.

ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ, అసలేం జరిగిందని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందంలో మునిగిపోయారు.

సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటాపంచుకున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట.

No comments:

Post a Comment

Post Top Ad