టీకాతోనే కట్టడి

Telugu Lo Computer
0


టీకా  ద్వారా మాత్రమే ఇమ్యూనిటీని సాధించగలమని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారి  చెప్పారు.  హెర్డ్‌ ఇమ్యూనిటీ ద్వారా నియంత్రించవచ్చునన్న అభిప్రాయం సరైందికాదు. 70 నుంచి 90 శాతం ప్రజల్లో యాంటీబాడీలు ఉత్పత్తి అయితే దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీ పరిగణించవచ్చునని ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే 60 శాతం మందిలో వచ్చినా దానిని హెర్డ్‌ ఇమ్యూనిటీగా చెప్పుకోవచ్చునని వైరాలజిస్టు షాహిద్‌ జమీల్‌ చెప్పారు. ఇటీవల జర్నల్‌ సైన్స్‌లో ప్రచురించిన అధ్యయనం కూడా గతంలో ఉన్న అంచనాల కంటే తక్కువ మందిలో యాంటీబాడీలు ఉన్నా హెర్డ్‌ ఇమ్యూనిటీ అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చునని వెల్లడించింది. అయితే కోట్లాది  జనాభా ఉన్న భారత్‌లో సాధారణ ప్రక్రియ ద్వారా హెర్డ్‌ ఇమ్యూనిటీ అసాధ్యం అన్న అంశంలో శాస్త్రవేత్తలో ఏకాభిప్రాయం నెలకొని ఉంది. కాగా, భారత్‌ వంటి దేశాల్లో జాతీయ స్థాయిలో హెర్డ్‌ ఇమ్యూనిటీని సాధించాలనుకోవడం వ్యూహాత్మక తప్పిదమే అవుతుందని వైరాలజిస్టు జమీల్‌ అభిప్రాయపడ్డారు. దేశంలో 70 శాతం మందికి కరోనా సోకి వారిలో ఇమ్యూనిటీ పెరగాలని కోరుకోవడం సరైంది కాదన్నారు. టీకా  వేయడం వేగవంతం చేస్తేనే సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)