కరోనా - బ్లాక్ ఫంగస్

Telugu Lo Computer
0

 

కరోనా నుంచి కోలుకున్నవారిలో బ్లాక్ ఫంగస్ వైరస్ పెరిగిపోతున్నట్లు అహమ్మదాబాద్, ఢిల్లీ, పూణే లోని డాక్టర్స్ గుర్తించారు. ఫస్ట్ వేవ్ లో కోలుకున్న కోవిద్ రోగులలో కొందరికి ఈ ఇన్ఫెక్షన్ సోకింది. ఇప్పుడు ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో గత రెండు రోజులలో ఆరు కేసులను గుర్తించినట్లు ఈఎన్టీ సర్జన్ మనీష్ ముంజల్ తెలియజేసారు. 

మ్యూకోర్మైసెస్ గా పిలిచే ఈ ఫంగస్ సోకితే రోగి ప్రాణాలు కూడా పోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి వాతావరణంలో సహజంగానే ఉంటాయి. ఇది మనుషులకు అరుదుగా సోకుతుంది. ఇది సోకినవారి అవయవాలపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. స్టెరాయిడ్స్ వినియోగించినవారికి ఎక్కువ సోకే అవకాశం ఉన్నది. ఐసీయూలో చికిత్స పొందిన వారిలో, అవయవ మార్పిడి జరిగిన వారికి కూడా సోకే ప్రమాదం ఉన్నది. 

ఈ ఫంగస్ ఉపిరితిత్తులో, సైనస్ వద్ద చేరతాయి. కొన్నిసార్లు శరీరానికి అయిన గాయాల ద్వారా లోపలి చేరతాయి. 

దీనిని బయాప్సీ పరీక్షల ద్వారా ఖరారు చేస్తారు. ఏది సోకినా వారిలో సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. మూడోవంతు మంది చూపు కోల్పోతున్నారు. కొంతమందికి ముఖం వాపు, ముక్కు ఒకవైపు మూసుకుపోయినట్లు ఉండటం, కళ్ళవాపు వంటి లక్షణాలు బయటపడతాయి. ఊపిరితిత్తుల్లోకి చేరితే దగ్గు, ఛాతిలో నొప్పి, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలు కనబడతాయి. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించదు. ముందుగా గుర్తించి యాంటీ ఫంగల్ వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని డాక్టర్స్ అంటున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)