అస్తమా వ్యాధిగ్రస్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు

Telugu Lo Computer
0


వాతావరణాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితులు మారే అస్తమా వ్యాధిగ్రస్తులు ఇల్లాంటి సమయాలలో జాగ్రత్తగా ఉండాలి. భౌతిక దూరం పాటించాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయాలి. నడక, యోగ, ఈత వంటివి చేయాలి. చల్లని పదార్థాలు, వాతావరణానికి దూరంగా ఉండాలి. ఒకరి ఇన్ హేలర్ మరొకరు వాడకూడదు. అవసరమైతేనే హాస్పిటల్ కు వెళ్ళాలి. అస్తమా వ్యాధిగ్రస్తులు ఆయాసం రాగానే కరోనా సోకిందేమోనని భయపడుతున్నారు. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

అస్తమా వ్యాధిగ్రస్తులు డ్రై పౌడర్ ఇన్ హేలర్, మీటర్ డోస్ ఇన్ హేలర్స్ అనే రెండు రకాలు ఇన్ హేలర్స్ వాడుతుంటారు. మీటర్ డోస్ ఇన్ హేలర్స్ వాడేటప్పుడు స్పెషర్ ని ఉపయోగించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నేబులైజర్ వాడటం వలన కరోనా వ్యాపించే ప్రమాదం వుంది. ఏవి వాడినా పరిస్థితి మెరుగు పడకపోతే డాక్టర్ సలహాతో తెబ్లేట్స్ ను వాడాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)