నిస్వార్ధ సేవ .......!

Telugu Lo Computer
0


ఒకసారి రామకృష్ణ పరమహంస  కాళీమాత పై ఉన్న అమోఘమైన భక్తితో   అమ్మవారికి భోజనం సమర్పించి అమ్మవారి రాకకై   వేచి ఉన్నాడు.అంతలోనే   ఆకలిగా ఉన్న బిచ్చగాడు   అమాంతంగా అమ్మవారి దగ్గర ఉన్న   భోజనం తీనేస్తాడు.   అది చూసిన రామకృష్ణ పరమహంస కోప్పడకుండా మళ్లీ  నైవేద్యం తయారుచేసి   అమ్మవారిని తినమని ప్రాధేయపడతాడు.   అమ్మవారు వచ్చి తినేదాకా  ఇక్కడ నుంచి పోయేదిలేదని మొండి పొట్టుతో కూర్చుని వేచిఉన్నాడు. ఆయన నిస్వార్ధభక్తికి మెచ్చిన   ఆ కాళిమాత వచ్చి నాకు ఆకలిగా లేదు. ఇప్పుడే కదా నాకు భోజనం సమర్పించావు.   కడుపు నిండిన తర్వాత ఎలా తినానగలను చెప్పు పుత్రా! అని అడుగుతుంది. విషయం అర్థంకాక రామకృష్ణ పరమహంస నీకు పెట్టినా నైవేద్యం భిక్షవాడు తీనేసాడు కదా? మరి నువ్వు ఎప్పుడు తిన్నావని ప్రశ్నిస్తాడు. ఆ మాటకు  కాళికామాత   ఆకలిగా ఉన్న భిక్షవాడిని కూడా నేనే! ఈ ప్రపంచంలో ఎవ్వరు నిస్వార్ధంగా   ఆపదలో ఉన్నవారికి,   ఆకలితో ఉన్నవారికి సహాయం చేస్తారో  ఆ సహాయం నాకు(దేవుడికి) చేసినట్లే!  అందరూ నా పిల్లలే కదా!   అని సమాధానం చెప్పి వెళ్లి పోయింది.అప్పటినుంచి రామకృష్ణుడు అందరిలోనూ,అన్నింటి లోనూ అమ్మను (కాళీమాతను) చూసుకుని జీవితం గడిపేవారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)