కాయాపేక్షా, ఫలాపేక్ష

Telugu Lo Computer
0

 


 కాయాపేక్షా, ఫలాపేక్ష అంటే...ఈ కాయము పై ( దేహంపై అపేక్షని ) , ఫలాపేక్షా ( కర్మ ఫలముపై అపేక్షని) పూర్తిగా వదులుకొని నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. కాశీకి వెళితే...కాయో పండో వదిలేయాలి అని పెద్దలు చెప్పిన దానిలో మర్మం అదే. 

 శాస్త్రం లో ఎక్కడ కూడా.. కాశీ కి వెళితే కాయో, పండో వదిలేయాలి అని చెప్పలేదు..

శాస్త్రం చెప్పిన విషయాన్ని.. కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చుకున్నారు.

కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే... కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి " కాయాపేక్ష మరియు ఫలాపేక్ష" ను గంగలో వదిలి, ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.

కాలక్రమేణా...అది కాస్తా కాయ, పండు గా మారిపోయింది.

అంతే కానీ...  కాశీ వెళ్లి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగ లో వదిలేస్తే...మనకు వచ్చు ముక్తి ఏమి వుండదు. 

కనుక.... శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అర్థం చేసుకొని... ఆ క్షేత్ర దర్శనము, ఆ సంప్రదాయం పాటిస్తే..నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది కాని మామిడి పండుని,  వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.

మీరు ఈసారి కాశీ వెళితే....మనకి శత్రువులు అయిన ఈ శరీరం పై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్షని మాత్రమే వదులుకొని, ఆ  సర్వేసుడ్ని  దర్శించుకొని  నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలని ప్రార్ధించండి.

Post a Comment

0Comments

Post a Comment (0)