గాలిలో వైరస్ ప్రభావం

Telugu Lo Computer
0


కరోనా వైరస్ కణాలు గాలిలో ఎంత దూరం విస్తరిస్తాయనే దాని మీద అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్ములన కేంద్రం మరోసారి స్పష్ఠను ఇచ్చింది. వైరస్  సోకిన వారి నుండి 3 నుంచి 6 అడుగుల లోపు వ్యాప్తి అధికంగా ఉంటుందని, వెంటిలేషన్ లేని ప్రాంతాలలో 6 అడుగుల కంటే కాస్త ఎక్కువగా ఉంటుందని అమెరికా సిడిసి తాజా మార్గదర్శికాల్ల్లో తెలియజేసింది. 

వైరస్ వ్యాప్తిని మూడు రకాలుగా సిడిసి వర్గీకరించింది. 

1. అతి చిన్న శ్వాశకోశ కణాలను నేరుగా పీల్చడం.  

2. వైరస్  సోకిన వారు తుమ్మినా, దగ్గినప్పుడు ఇతరుల ముక్కు, నోరు వంటి శ్లేష పొర్లపై వైరస్ కణాలు చేరడం. 

3. వైరస్ తో కలుషితమైన ప్రదేశాలను నేరుగా చేతులతో తాకడం 

శ్వాసించినప్పుడు, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు విడుదలయే సూక్ష్మ బిందువులలో కాస్త పెద్ద పరిమాణంలో ఉన్నవి అత్యంత తొందరగా నేలపై పడిపోతాయి. అత్యంత స్వల్ప పరిమానంలో మిగిలిపోయిన కణాలు మాత్రం ఒకొక్కసారి కొన్ని నిముషాల పాటు గాలిలోనే క్రియాశేలంగా ఉంటాయి. అవి గాలిలో ఎంతసేపు ఉంటాయి అనేది ఆయా ప్రాంతాల ఉష్ణోగ్రత, తేమను బట్టి ఉంటుంది. గాలి బయటకు వెళ్లలేని ప్రాంతాలలోనే ఎక్కువ వ్యాప్తి ఉంటుంది. వైరస్ సోకిన వ్యక్తి వెళ్లిన మార్గంలో వెంటనే వారిలో వైరస్ సోకే ప్రమాదం ఉన్నదని 'సిడిసి తాజా మార్గదర్శికాలలో పేర్కొంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)