మా తరం......

Telugu Lo Computer
0

 


*  స్వచ్చమైన గాలి నీళ్ళు, పచ్చటి  పొలాలు పరిశుభ్రమైన వాతావరణంలో పుట్టి పెరిగిన వాళ్ళం... 
*  తలపై నుండి చెంపల మీదకు కారేలా నూనె రాసుకుని...
చేతికి పుస్తకాల సంచి తగిలించుకుని ఒక్కడిగా బయలుదేరి దారిలో స్నేహితులను ఒక్కొక్కళ్లను కలుస్తూ పెద్దగుంపుగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బడికి కాళ్లకు చెప్పులు లేకుండా నడచి వెళ్ళిన తరం మాది. 
*  జారిపోయే నిక్కరు మీదకు మొలతాడు లాక్కుంటు, చిరుగులకు గుడ్డ పీలికలు అతుకు లేయించుకున్న వాళ్ళం.
*  10 వ తరగతి అయ్యే వరకు నిక్కరు వేసుకున్న తరం మాదే..
*  గోలీలు, బొంగరాలు, కర్రా బిళ్ళ, నేలా బండ, ఉప్పాట, ఏడు పెంకులాట ఆడిన తరం మాదే..
*  బంతి పుచ్చుకుని నేరుగా కొట్టేసుకుంటే బంతి లాగ  వంటి మీద ముద్ర పడే ముద్రబాల్ లాంటి ఆటలాడిన తరం.,
* బడికి వేసవి కాలం సెలవులు రాగానే తాటి చెట్లూ, సీమ తుమ్మ చెట్లూ, ఈతచెట్లు ఎక్కి కాయలు కోసుకొని తిన్న వాళ్ళం, చెరువులు, కాలవల్లో స్నానాలు     చేసిన వాళ్ళం, తాటి బుర్రలు బండితో ఆడినోళ్లం...
* దీపావళికి తాటి బొగ్గుల రవ్వల దివిటీ కోసం   వళ్ళంతా మసి పూసుకొని మరీ తయారు చేసుకనే వాళ్ళం.
* 5 పైసల ఐస్ తిన్నది మేమే, పది పైసలతో బళ్ళో మ్యాజిక్   షో చూసింది మేమే.. 
* వర్షం వస్తె తాటాకు గొడుగూ,  గోనె   సంచులను కప్పుకుని బడికి వెళ్ళిన వాళ్ళం..
*  సెకండ్ హ్యాండ్ టెక్స్ట్ బుక్స్  కోసం పరీక్షలు  అయినప్పటి నుండి ముందు తరగతి వాళ్ళని    బతిమాలిన తరం.
* సెకెండ్ హ్యాండ్ సైకిల్ తొ పక్క తొక్కుడుతో సైకిల్ నేర్చుకున్నోల్లం మేమే..
* ఉత్తరాలు రాసుకున్న, అందుకున్న తరంవాళ్ళం మాదే. 
* పండగ సెలవులు, వేసవి సెలవులు, దసరా, సంక్రాంతి   సెలవులు, ఎన్ని సెలవులు వొచ్చినా ఐదు పైసలు   ఖర్చులేకుండా  ఆటపాటలతో ఆనందాన్ని అనుభవించిన తరంవోళ్ళం...,
*  పెద్దలు, పిల్లలూ అందరం వీధి అరుగుల మీద కూర్చుని ఎన్నో సాయంత్రాలు, రాత్రులు ఆనందంగా    కబుర్లు చెప్పుకుని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నదీ మేమే.... 
*  ఎవరి ఇంట్లో ఏ వేడుక జరిగినా మన ఇంట్లో జరిగినట్లు అంతా మాదే.., అంతామేమే అన్నట్లుగా    భావించి స్వచ్చందంగా, నిస్వార్థంగా పాలుపంచుకున్న    తరం మాదే.
* ఒక ఇంట్లో దొంగలు పడ్డారని పిల్లలు, అందరం  కలిసి ఊరు చుట్టూ తెల్లవార్లూ ఎన్నో రాత్రులు టార్చిలైట్స్, కర్రలు పట్టుకుని కాపలా కాసిన వాళ్ళం  మేమే.
*  ప్రతీ శ్రీరామ నవమికీ వినాయక చవితికి   గుడి దగ్గర తాటాకు పందిరికి రంగు కాగితాలు అంటించడం, మామిడి తోరణాలు కట్టడం కోసం ముందు రోజు రాత్రంతా జాగారం చేసింది మేమే.
* చుట్టాలు వస్తేనే అమ్మ ప్రత్యేక వంటలు వండి పెట్టిన తరం..
అత్తయ్యా, మామయ్య, పిన్ని, బాబాయ్, అక్కా, బావ       అంటూ ఆప్యాయంగా పిలుచుకున్న తరం,
* స్కూలు మాష్టారు కనపడితే భయంతో పక్కనున్న సందుల్లోకి పారిపోయిన తరం...
* పుల్లల పొయ్యి మీద అన్నం, కూర ఉడుకుతున్నప్పడు   వచ్చే అద్బుతమైన పరిమళాన్ని ఆస్వాదించిన తరం.
* పొయ్యి మీద నుంచి నేరుగా పళ్ళెంలోకి వచ్చిన వేడి వేడి అన్నంలో ఆవకాయ, వెన్నపూస వేసుకుని పొయ్యి దగ్గరే  తాతయ్యలు, అమ్మమ్మ,నాయనమ్మ, అమ్మానాన్నా, పెదనాన్న, పెద్దమ్మ, పిన్ని బాబాయ్, అత్తయ్య    మామయ్య, అక్కలు చెల్లెళ్లు, అన్నయ్యలు, తమ్ముళ్లు   అందరం ఒకే దగ్గర చేరి మధురమై అనుభూతితో  కూర్చుని అన్నం తిన్న తరం.
* అమ్మమ్మలు, నాయమ్మల చేత గోరుముద్దలు తిన్నది.. "అనగనగా ఒక రాజు..."కథలు విన్నది మేమే..
* నూనె పిండితో నలుగు పెట్టించుకుని కుంకుడు కాయ పులుసుతో  తలంటు స్నానం చేయించుకున్న తరం.
* రేడియో, దూరదర్శన్, టూరింగ్ టాకీస్ కాలం చూచిన వాళ్ళం.
* 40 పైసల నేల టిక్కెట్ తో నేల మీద కూర్చుని, 
1.20 రూపాయల కుర్చీ  టిక్కెట్ తో  2 రూపాయల టిక్కెట్ తో బాల్కనీ లో కూర్చుని సినిమా చూచిందీ మేమే...
*  స్కూల్, కాలేజీ రోజుల్లోనే ఎలక్షన్లు చూచిన వాళ్ళం.
*  అమ్మా నాన్నాతో సంవత్సరానికి ఒక సారి, "పరీక్ష పాస్ అయ్యావా.." అని మాత్రమే అడిగించుకున్న   తరం వాళ్ళం.
 *  అప్పటికీ ఇప్పటికీ పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చే తరం మాదే
ప్రస్తుతం ఉన్న వాట్సప్, పేస్ బుక్, స్కెయిపే  మీతో పాటు సమానంగా వాడేస్తున్న మాతరం..,
*  మేమే ఆ తరానికి  ఈ తరానికి మధ్యవర్తులం.. మేమే..
అవును....
*  రెండు తరాల మద్యలో జరిగిన   అనూహ్యమైన మార్పులకు మేమే సాక్షులం..
*  మన ముందుతరం
తల్లిదండ్రుల పై భయభక్తులు ...ఉన్న వాళ్లు... మన తరువాత తరం వాళ్లు వాళ్ల పిల్లలకు భయపడుతుంటారు..
*  మనం మాత్రం అటు తలిదండ్రులకు ఇటు పిల్లలకు భయపడే..అనిశ్చిత తరం. 

Post a Comment

0Comments

Post a Comment (0)