ప్రముఖ వైరాలజిస్ట్ జమీల్ రాజీనామా !

Telugu Lo Computer
1

 

కరోనా వైరస్  రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతోంది. రెండు మూడురోజులుగా రోజువారీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతోన్నప్పటికీ.. మరణాల్లో మాత్రం ఉధృతి కొనసాగుతోంది. రోజూ నాలుగు వేలకు పైగా  మరణాలు సంభవిస్తున్నాయి.  కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి చాలా  రాష్ట్రాలు సంపూర్ణ లాక్‌డౌన్‌లోకి వెళ్లాయి. కోవిడ్ కట్టడి చర్యలను కఠినంగా అమలు చేస్తున్నాయి.

కోవిడ్ పరిస్థితులపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం  కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఆఫ్ ద ఇండియన్ సార్స్-సీఓవీ-2 జీనోమిక్ కన్సార్టియం ఛైర్మన్ షహీద్ జమీల్ తన పదవికి రాజీనామా చేశారు.

కరోనా వైరస్ విజృంభిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో కొత్తరకం కోవిడ్ స్ట్రెయిన్లు, వేరియంట్లపై అధ్యయనం, కరోనా మరింత వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపై కేంద్రానికి సిఫారసులు చేయడం, ఇదే అంశంపై వివిధ దేశాలు ఏర్పాటు చేసిన అడ్వైజరీ గ్రూప్‌లతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు నిర్వహించడం వంటి కొన్ని కీలక బాధ్యతలు ఈ కమిటీ చేతుల్లో ఉన్నాయి. బ్రిటన్‌లో పుట్టుకొచ్చిన కరోనా కొత్తరకం వేరియంట్ బీ117 గురించి మొట్టమొదటి సారిగా కేంద్రప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది

తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఆయన వివరించలేదు. కరోనాను కట్టడి చేయడానికి తాము చేసిన సూచనలు, సిఫారసుల పట్ల కేంద్ర ప్రభుత్వం పెద్దగా స్పందించట్లేదని, కీలకమైన విషయాల్లో మొండిపట్టుదలకు పోతోందంటూ న్యూయార్క్ టైమ్స్‌లో ఆయన ఓ వ్యాసం  రాశారు. కరోనా నివారణకు అవసరమైన విధానాలను రూపొందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు.

దేశంలో కోవిడ్ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్ కార్యక్రమం మందకొడిగా సాగుతుండటం, వ్యాక్సిన్ కొరత, దేశీయ ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉందంటూ ఆయన ఆ వ్యాసంలో వ్రాశారు.

Post a Comment

1Comments

  1. pramukha na? ela? emaina kanipettada? deshaniki manchi peru tecchada? emaina awardulu vacchaya? eppudu itani peru kuda vinalede? turakavadu ainanta matrana oka rojulone, pramukhuda? pida poyindi ilanti vallu technology ni pak, shatrudeshalku ivvakunda.

    ReplyDelete
Post a Comment