కరోనా - మన జీవన శైలి

Telugu Lo Computer
0

 


కరోనా వైరస్ పుణ్యమా అని మన జీవన శైలిలో  కూడా అనేక మార్పులు వచ్చాయి.   వ్యక్తిగత శుభ్రత నుండి ఆహారపు అలవాట్ల వరకు.  వ్యక్తిగత శుభ్రతతోపాటు  రోజూ  ఉపయోగించే వస్తువులను కూడా  పరిశుభ్రంగా  వుంచుకోవాలి. వాటిని ఎలా  శుభ్రం చేసుకోవాలో చూద్దామా!

*  స్మార్ట్ ఫోన్లు  వైరస్ వ్యాప్తికి ఎక్కువగా దోహదపడుతుంది. . స్మార్ట్ ఫోన్ స్క్రీన్ పై హానికారక బాక్టీరియా ఉంటుంది. అందువలన ఫోన్ ను ఆల్కహాల్ తో శుభ్రం చేసుకోవాలి. అలాగే టీవీ, ఏసీ, రిమోట్లను తరచూ తుడుస్తుండాలి.

* కంప్యూటర్ కీబోర్డు మీద బోలెడన్ని క్రిములుంటాయి. వాటికి  వైరస్ సోకే ప్రమాదం  ఎక్కువగా ఉంటుంది. సేఫ్ క్లీనర్ లేదా ఆల్కహాల్ తో కీబోర్డ్ శుభ్రం చేసుకోవాలి. 

* మంచం, పరుపు, దుప్పటి, తలగడ మీద ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది. దీనివలన నిద్రపట్టకపోవడమే కాకుండా.. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. మంచంతో పాటు . దుప్పటి, దిండ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. దిండ్లను, దుప్పట్లను వారానికి ఒకసారి ఉతుకోవాలి 

* వాటర్ బాటిళ్లను యాంటీ  బాక్టీరియల్ సబ్బును ఉపయోగించి  వేడినీటితో కడగాలి. లేదా బ్యాక్టీరియాను చంపే గుణమున్న రాగి బాటిల్స్ ఉపయోగించాలి. 

* వేళ్లకు పెట్టుకునే ఉంగరాల ద్వారా బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. వాటిని ఎప్పుడూ యాంటీ బాక్టీరియల్ సబ్బు, వేడినీరు లేదా ఆభరణాలను శుభ్రం చేసుకునే లిక్విడ్తో శుభ్రం చేసుకోవాలి. 
 

* కాఫీ, టీ కప్పులను కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇవే కాకుండా ఇంటి వంటగదిని, ఇతర గదులను, పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించే స్పాంజిలను ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేడి నీటిలో మరిగించాలి. డోర్ హ్యాండిల్స్, బాత్ రూం సింక్ యాంటి బాక్టీరియల్ క్లీనర్ తో శుభ్రం చేయాలి.

* మనం రోజూ వాడే టూత్ బ్రష్ ను యాంటి బ్యాక్టీరియల్ మౌత్ వాష్ లో నానబెట్టి.. ఆ తర్వాత బ్రష్ శుభ్రం చేస్తే బ్యాక్టీరియా నశిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)