ఇంటి నుంచే పరీక్షలు

Telugu Lo Computer
0

 

పరీక్షలు నిర్వహించే సమయానికి సెకండ్ వేవ్ ఉధృతి పెరగడంతో  అన్ని విద్యాసంస్థలను మూసివేయవలసి వచ్చింది. ఈ క్రమంలో పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేయడమో, వాయిదా వేయడమే చేశాయి. 

ఈ నేపథ్యంలో ఛతీస్ఘడ్ ప్రభుత్వం నూతన ఆలోచన చేసింది. 

12వ తరగతి  పరీక్షలు ఓపెన్ బుక్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధి విధానాలను విడుదల చేసింది. జూన్ 1 నుండి 5 లోపు ఎప్పుడైనా పరీక్ష పత్రాన్ని, కీ ని విద్యార్థి తీసుకోవచ్చు. పరీక్ష రాసిన ఐదు రోజులకు సమాధాన పత్రాన్ని ఇన్విజిలేటర్ కు సమర్పించాల్సి ఉంటుంది. సమాధాన పత్రాన్ని పోస్టులో పంపితే స్వీకరించరు. కెమెరా పర్యవేక్షణలో ఇవి జరుగుతాయి.  

కరోనా వ్యాప్తి వివపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్‌ పరీక్షలను ఇంటినుంచే ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. అయితే తొలుత ప్రయోగాత్మకంగా బీటెక్‌ ఎనిమిదో సెమిస్టర్‌ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించా లని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కారణంగా విద్యాసంస్థలు మూతపడగా, అనేక పరీక్షలు వాయిదాపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో సైతం విద్యా సంస్థలు మూతబడ్డాయి. పరీక్షలు సైతం వాయిదా పడ్డాయి. 

ఆన్‌లైన్‌ బోధన

కరోనా నేపథ్యంలో అధ్యాపకులంతా ఇంటి నుంచే పాఠాలు బోధించేందుకు అవకాశం కల్పిస్తూ జేఎన్‌టీయూ ఉత్తర్వులు జారీచేసింది. యూజీ, పీజీ కోర్సులకు సంబంధించిన అధ్యాపకులంతా ఇంటి నుంచే ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ మంజూర్‌ హస్సేన్‌ సర్కులర్‌ జారీచేశారు. అటానమస్‌, గుర్తింపు పొందిన, ఇతర కాలేజీలన్నీ ఈ ఉత్తర్వులను పాటిస్తూ షెడ్యూల్‌ ప్రకారం తరగతులను నిర్వహించాలని స్పష్టం చేశారు. అయితే అధ్యాపకు లను కాలేజీకి రావాలని ఇబ్బంది పెట్టవద్దని యాజమాన్యాలకు సూచించారు. కాలేజీలన్నీ తప్పని సరిగా నిబంధనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు.





Post a Comment

0Comments

Post a Comment (0)