మన పూర్వీకులు - ఆరోగ్య సూత్రాలు

Telugu Lo Computer
0

 

మన పూర్వీకులు కొన్ని సాంప్రదాయాలను మనకు వదలి వెళ్లినా మనం వాటిని పాటించక, అశ్రద్ధ చేశాము. వాటిలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి. కరోనా పుణ్యమా అని వాటిని తిరిగి  పాటిస్తు న్నాము. అవి ఏమిటో చూడండి. 

* రాగి పాత్రలోని నీరు త్రాగాలి  

* ఇంటికి దూరంగా మరుగుదొడ్లు వుండేవి

* చెప్పులు ఇంటి బయట విడిచి కాళ్ళు చేతులు ముఖం కడుక్కున్న తరువాతే ఇంట్లోకి వెళ్లేవారు. 

* ఇంటా బయట ప్రతీ గడపకీ పసుపు ఎందుకు రాసేవారు

* వారానికి ఒకసారి ఇంట్లో సామానులన్నీ సర్ది ఇల్లంతా కడిగేవారు

* సుద్దతో ఇల్లంతా ముగ్గులు  వేసేవారు

(కాల్షియం నుండి విలువడే ధాతువులు ఇల్లంతా వ్యాపించి కొన్ని వ్యాధికారక వైరస్ లను నిరోదిస్తాయి)

* సుచిగా స్నానం చేశాకే వంట ఎందుకు చేసేవారు. 

* నోట్లో వేళ్ళు పెట్టుకోవద్దని,  గోళ్లు కొరకొద్దని, ఏదయినా తినేముందు చేతులు కడుక్కోవాలని  చెప్పేవారు.

* మనం బయటకు వెళ్లేముందు ఎవరైనా తుమ్మితే ఆపశకునం అని, కొద్ది క్షణాలు ఆగి వెళ్ళమని చెప్పేవారు.

(ఆ తుమ్మిన వ్యక్తి నోటినుండి ముక్కు నుండి వెలువడిన తుంపరలు కొద్దిసేపు గాలిలో తేలియాడి మెల్లగా నెలమీదకు చేరుకుంటాయి.... ఆ తుంపరల బారినపడి అంటువ్యాధులు రాకుండా వుండాలని ఆలా చెప్పేవారు)

* బయటకు వెళ్ళాక తెలిసినవాళ్ళు ఎదురు పడితే (కరచాలనం చేయ్యకుండా) రెండు చేతులు జోడించి నమస్కారం చేసేవారు.

* ప్రతి  కూరలోనూ పసుపు  వేసేవారు

* నెలకి ఒక్కసారి అయినా మిరియాల చారు, మెంతుల పులుసు తప్పనిసరిగా  చేసేవారు.

* కనీసం ఆరు నెలలకి ఒక్కసారి అయినా ఆముదం  పట్టించేవారు.

* మట్టి పాత్రలలో వంటకాలు.


Post a Comment

0Comments

Post a Comment (0)