సామెతలు!

Telugu Lo Computer
0

 

* చల్లకు వచ్చి ముంత దాచినట్లు

* నిద్రపోయేవాణ్ని లేపవచ్చు - నటించే వాణ్ని లేపలేము 

* ఆహారం దగ్గర వ్యవహారం దగ్గర మొహమాటం పనికిరాదు

* ఉరంతా నాన్నకి వణికితే, నాన్న అమ్మకు వణికాడట

* కలలో జరిగింది ఇలలో జరగదు

* చేసేవి లోపాలు – చెపితే కోపాలు

* పిల్లని చూసి చీర, బావిని చూసి చేద కొనాలి

* పైన పటారం –  లోన లొటారం 

* చంకలో పిల్లను పెట్టుకొని ఊరంతా  వెతికినట్లు

* తాంబూళాలు ఇచ్చాము  తన్నుకు చావండి అన్నట్లు!

* చంద్రునికో నూలుపోగు

* చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం!

* చదవేస్తే ఉన్న మతి పోనట్టు !

* చదువూ లేదు – సంధ్యా లేదు

* చనువిస్తే చంక కెక్కినట్లు!


Post a Comment

0Comments

Post a Comment (0)