హైడ్రోజన్ థెరపీ

Telugu Lo Computer
1

 

ఇప్పటికే అమెరికా, జపాన్, చైనా దేశాలలో గత 20 సంత్సరాలుగా అమలు చేస్తున్న హైడ్రోజన్ థెరపీని హైదరాబాద్ లోని  మెడిలైట్  హెల్త్ కేర్ సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. కరోనా చికిత్సలో  హైడ్రోజన్ థెరపీతో మంచి ఫలితాలు వస్తున్నాయని,  హైడ్రోజన్ గ్యాస్ నీళ్లను తాగితే ఆక్సిజన్ లెవెల్స్ పెరగడమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని   వైద్యులు  చెబుతున్నారు. 
 హైడ్రోజన్ నీరు రక్తంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచడమే కాకుండా దెబ్బతిన్న కణాల పునరుద్ధరణకు దోహదపడుతుంది. 
 హైడ్రోజన్ వాటర్ విటమిన్ సి కంటే 188 రెట్లు అధిక ప్రయోజనం చేకూరుస్తుందని ఆక్సఫర్డ్ యూనివర్సటీ వెల్లడించింది. దీనిలో వుండే కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి మినరలస్ తో పాటు హైడ్రోజన్ వాయువు విడుదలవుతుంది. ఆ నీటిని త్రాగటం వలన రక్తంలోకి  హైడ్రోజన్ త్వరగా కలసిపోయి కణాలకు ఆక్సిజన్ అందించడం ద్వారా కణాలు దెబ్బతినకుండా ఉంటాయి.
 మెడిలైట్  హెల్త్ కేర్ సంస్థ వారు హైదరాబాద్ నగరంలో 2016 నుండి అనేక ప్రాంతాలలో ఈ నీటిని 20 లీటర్ల క్యాన్లల్లో సప్లై చేస్తుంది. ఈ నీరు త్రాగిన వారిలో ఆక్సిజన్ స్థాయి సాధారణంగా వుండటమే కాకుండా రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని  మెడిలైట్  హెల్త్ కేర్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ శ్రీనివాస్ చెబుతున్నారు. 

Post a Comment

1Comments

  1. There is limited scientific evidence that hydrogen water has any health benefits in humans, although its proponents make claims it provides such benefits as functioning as an antioxidant, reducing inflammation, reducing risk of metabolic syndrome, providing neuroprotection for various diseases, and reducing side ... Wikipedia.

    ReplyDelete
Post a Comment