కరోనా - 2-డియాక్సీ, డి-గ్లూకోజ్ (2డీజీ)

Telugu Lo Computer
0

 


కరోనాకు మరొక మందు అందుబాటులోకి వచ్చింది. డీఆర్డిఓ అభివృద్ధి చేసిన 2-డియాక్సీ, డి-గ్లూకోజ్ (2డీజీ) మందు వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (డిసిజిఐ) అనుమతినిచ్చింది. ఒక మోస్తరు నుండి తీవ్రమైన లక్షణాలున్న కరోనా రోగులకు కూడా ఇది పనిచేస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైయింది. బాధితులు త్వరగా కోలుకోవడానికి, ఆక్సిజన్ తగ్గిస్తున్నదని డీఆర్డీఓ తెలిపింది. ఈ ఔషధంతో చికిత్స పొందిన వారికీ ఆర్టీటేపిసీఆర్ టెస్టులు చేయగా ఎక్కువ శాతం  మందికి నెగటివ్  వచ్చిందన్నారు. జనరిక్ మూలకాలతో తయారీ కాబట్టి ఉత్పత్తి కూడా సులభమేనని తెలిపింది. 

ఇది పొడి రూపంలో ఉంటుంది. డీఆర్డీఓలోని న్యూక్లియర్ మెడిసిన్ అండ్ ఎలీడ్ సైన్సెస్  ల్యాబులో ఈ పొడిని తయారుచేసింది. ఇందుకు హైదరాబాద్‌లని డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ సహకారం అందించింది. 

ఇది అన్ని మందుల లాంటిది కాదు. అసలు దీన్ని తయారుచేసిన విధానమే ప్రత్యేకం.  ఈ పొడి కరోనా రోగుల శరీరంలో కరోనా వల్ల దెబ్బతిన్న కణాలను గుర్తిస్తుంది. అక్కడ వైరస్‌జ్ అభివృద్ధి చెందకుండా అడ్డుకుంటుంది. అందువల్ల వైరస్ నీరసించిపోతుంది. దాని వల్ల వైరస్ ఇక వృద్ధి చెందలేదు.  క్రమంగా వైరస్ నీరసించి చనిపోతుంటే... కరోనా నయం అయిపోతుంది. ఫలితంగా కణాలు తిరిగి రిపేర్ అయ్యి... బాగవుతాయి. పేషెంట్లు రికవరీ అయ్యి కోలుకుంటారు.

పొడిలా వుండే ఈ మందు చిన్న చిన్న పొట్లాలలో లభిస్తుంది. నీళ్లలో కలుపుకొని తాగితే, వైరస్ చేరిన కణాలలోకి ప్రవేశించి వృద్ధిని అడ్డుకుంటుంది. అందువల్లే భాదితులు వేగంగా కోలుకోవడానికి సహకరిస్తుందని క్రినికల్ ట్రయిల్స్ లో గుర్తించారు. 




Post a Comment

0Comments

Post a Comment (0)