సూపర్ స్పైడర్లకు వ్యాక్సిన్ !

Telugu Lo Computer
0


వ్యాక్సినేషన్ ప్రక్రియపై టిఆర్‌ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ వ్యాక్సినేషన్‌పై మంత్రి హరీష్ రావు సమీక్షలు జరిపారు. సూపర్ స్పైడర్లకు టీకాలు వేసే విషయంపై సమావేశంలో చర్చించారు.  ఎల్‌పిజి సిలిండర్లు సరఫరా చేసేవారు, రేషన్ దుకాణాల డీలర్లు, పెట్రోల్ పంపుల వర్కర్లు, బస్, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, రైతు బజార్లు, కూరగాయలు, పండ్లు, పూలు, నాన్‌వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారు, మద్యం అమ్మకాల వారికి టీకా ఇవ్వడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా తెలంగాణ వ్యాప్తంగా 30 లక్షల వరకు సూపర్ స్పైడర్స్ ఉంటారని అంచనా వేశారు. పని ప్రదేశాల్లో 18 ఏళ్లు దాటిన వారికి టీకాకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రవేటు ఆస్పత్రులతో పాటు పని ప్రదేశాల్లోని వారికి వ్యాక్సిన్ వేయాలని సూచించారు. వ్యాక్సిన్ కోసం ప్రైవేట్ ఆస్పత్రులతో  ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 28 నుండి సూపర్ స్పైడర్స్‌కి వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)