మరణించిన వైరస్ ఎంతసేపు ఉంటుంది ?

Telugu Lo Computer
0

 


కరొనతో చనిపోయిన వారిలో వైరస్ ఎంతసేపు ఉంటుంది అనే దాని మీద  ఎయిమ్స్ ఫోరెనిక్స్ చీఫ్ డాక్టర్ సుధీర్ గుప్త అధ్యయనం చేశారు.  చనిపోయిన వ్యక్తి ముక్కు, శరీరంలో 12-24 గంటల తరువాత బతకలేదని తెలిపారు. సంవత్సరం నుండి ఎయిమ్స్ డిపార్టుమెంట్ అఫ్   ఫోరెనిక్స్ మెడిసన్ అధ్యయనం చేస్తుందని తెలిపారు. వైరస్ బారినపడి మరణించిన 100కి పైగా శవాలను పరీక్షించామని, మృతదేహాలకు తిరిగి పరీక్షలు నిర్వహిస్తే నెగటివ్ వచ్చిందన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా మృతదేహం ముక్కు రంధ్రాలను, శరీరం నుండి ద్రవాలు స్రవించే ప్రదేశాలను  మూసివేయాలి.  అలాగే రోగికి అమర్చిన వివిధ పైపులను శానిటైజ్ చేయాలన్నారు. 

అంత్యక్రియల్లో పాల్గొనేవారు ముందస్తు జాగ్రతగా పీపీ కిట్లు, చేతికి గ్లవ్ జులు ధరించాలని, అంత్యక్రియలు ముగిసిన తరువాత చితాభస్మం సేకరించడం పూర్తిగా సురక్షిత మేనని అన్నారు. చనిపోయిన వారికి గౌరవం ఇచ్చే ఉద్దేశ్యంతోనే ఈ అధ్యయనం చేశామన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)