చిన్నారులు - కోవాగ్జిన్

Telugu Lo Computer
0

 

కరోనా యావత్ ప్రపంచాన్ని కబళిస్తున్న నేపథ్యంలో టీకాల ఆవశ్యకత ఏర్పడింది. 18 ఏళ్ల పైబడిన వారికి టీకా వచ్చింది. ఎప్పటి వరకు చిన్నారులకు టీకాలు లేవు.   పిల్లల వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచము ఎదురుచూస్తున్నది. ఈ మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశీయ దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకాను 2 నుండి 18 సంవత్సరాల వయస్సు వరకు క్లినికల్ పరీక్షలు జరిపేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతించింది. 2-18 ఏళ్ల వారిపై రెండు, మూడు  దశలలో క్లినికల్ పరీక్షలు నిర్వహించేలా నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు డీసిజిఐ ఈ అనుమతులు ఇచ్చింది. 

ఢిల్లీ ఎయిమ్స్, పాట్నా ఎయిమ్స్, నాగపూర్ మెడిట్రినా ఇన్ స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ సహా పలు సంస్థలలో ఈ ప్రయోగాలు జరగనున్నాయి. 

దీనికోసం 525 మంది ఆరోగ్యవంతులైన వాలంటీర్లను నియమించబడ్డారు. వీరికి 28 రోజులలో రెండు డోసులు ఇవ్వనున్నారు.  అమెరికాలో బుధవారం నుండి చిన్న పిల్లలకు కూడా టీకా వేసేందుకు ఫైజర్ కు అత్యవసర అనుమతులు లభించాయి.   

Post a Comment

0Comments

Post a Comment (0)