కరోనా - తొలి 5 రోజులు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

Responsive Ads Here

ad

https://www.videosprofitnetwork.com/watch.xml?key=b57b6ad0f2a1eb23e80de67d69315580

ad

Thursday, 6 May 2021

కరోనా - తొలి 5 రోజులు
 మీకు స్వల్ప జ్వరం ఉందా? కాస్త తలనొప్పి, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు కూడా ఉన్నాయా? వీటిలో ఏ ఒక్కటి ఉన్నా ఏమీ కాదులే అని లాపర్వా చేస్తున్నారా? తీరికలేని పని కారణంగా వచ్చాయని, ఎండలతో వచ్చాయని, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని తేలిగ్గా తీసుకుంటున్నారా? మీకు మీరుగా తీసుకునే ఈ నిర్ణయాలే అటు తరిగి ఇటు తిరిగి చివరికి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చు. అవును.. కరోనా చికత్సలో తొలి ఐదు రోజులు ‘గోల్డెన్‌ టైం’ అని వైద్యులు చెబుతున్నారు ఒంట్లో ఏ కాస్త నలతగా ఉన్నా వైద్యుల దగ్గరకు వెళ్లాలని సూచిస్తున్నారు.


చాలా మంది కరోనా లక్షణాలు కనిపించినా ప్రాథమిక దశలో అసలు పట్టించుకోవడం లేదు. ఏ చిన్న లక్షణమైనా కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే రూ.500 నుంచి రూ.2 వేల లోపు వైద్య ఖర్చుతో నయం చేసుకోవచ్చు. తొలి ఐదు రోజులు దాటిపోయి వారం రోజులకు ఆస్పత్రికివస్తే అప్పుడు చికిత్సకు రూ. 5 లక్షల నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చు చేసినా నయం కాకపోవచ్చునని చెబుతున్నారు. 


ముఖ్యంగా సాధారణ జ్వరం, తలనొప్పి, దగ్గు జలుబు, నీరసం ఉంటే ఒకటి రెండు రోజులు పరిశీలించాలి. పరిస్థితులను అనుసరించి నేరుగా కానీ, ఆన్‌లైన్‌ ద్వారా కానీ డాక్టర్‌ను కలిసి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. డెంగీ, వైరల్‌ ఫీవర్లు, టైఫాయిడ్‌ ఇలా అన్ని రకాల జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి. అయితే ప్రస్తుతం కొవిడ్‌ సమయం కాబట్టి, దానిని అనుమానించి పరీక్ష చేయించుకోవాలి. చాలా మందికి తమలో లక్షణాలు కనిపించినప్పటికీ నెగిటివ్‌ రిపోర్ట్‌ వస్తే దానిని నమ్ముకుని వైద్యం చేయించుకోవడం లేదు. కాగా ముందుగానే కరోనా లక్షణాలు గమనించిన దాదాపు మూడు వేల మందికి ఆన్‌లైన్‌ ద్వారా వైద్యం అందించినట్లు  సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ (ఏఐజీ)  డాక్టర్‌ జగదీశ్‌ చెప్పారు. వారి లక్షణాలు గమనించి  అవసరమైన మందులు ఇచ్చామన్నారు. జ్వరం, దగ్గు, జలుబు నివారణకు పారాసెటమాల్‌, యాంటిబయోటిక్‌ మందులు ఇచ్చి నయం చేసినట్లు ఆయన చెప్పారు. ముందే అవసరమైన చికిత్స తీసుకోవడం వల్ల ఒక్కరికి కూడా ఆస్పత్రికి రావాల్సిన అవసరం రాలేదన్నారు.


నెగెటివ్‌ వస్తే రిలాక్స్‌ కావొద్దు

మొదటి 5 నుంచి 7 రోజుల మధ్య కాలంలో 20 నుంచి 30 శాతం మంది చికిత్సకు దూరంగా ఉంటున్నారు. వైరస్‌ 50 నుంచి 70 శాతం మందిలో చాలా తక్కువగా  ఉంటోంది. ఇటువంటి వారికి వారం తర్వాత ఎప్పుడైనా విపత్కర పరిస్థితి ఎదురు కావచ్చు. సైటోక్రాన్‌ స్ట్రామ్‌ వల్ల కళ్లు తిరిగి ఆకస్మాత్తుగా కింద పడిపోతుంటారు. అప్పటికే పరిస్థితి అంతా తారుమారవుతుంది.


కొందరిలో అంతా బాగుందనుకుంటున్న సమయంలో రెండు రోజుల్లోనే ఆకస్మాత్తుగా ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌ అమాంతం పడిపోతోంది. అంత వరకు  95 వరకు ఉన్న ఆక్సిజన్‌ ఒక్కసారిగా 88కి తగ్గిపోతుండటంతో శ్వాస తీసుకోవడంలో అవస్థలు పడతారు. ఆక్సిజన్‌ 92 కంటే తక్కువగా ఉండి, జ్వరం 102, 103తో బాధపడుతున్న బాధితులు మందులు వేసుకున్నప్పటికీ మూడు రోజులకు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రిలో చేరాలి.


లక్షణాలు ఉన్నప్పటికీ రాపిడ్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలతో రీలాక్స్‌ కావద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఆస్పత్రిలో చేరుతున్న చాలా మంది బాధితుల్లో ఎక్కువమంది మొదట్లో నెగెటివ్‌ వచ్చిన వారే ఉంటున్నారు. అలాంటి వారే ఐసీయూలో చేరుతున్నారు. పరీక్షలన్నీ నెగెటివ్‌ వచ్చినా వైద్యుడు పర్యవేక్షణలో 5 నుంచి 7 రోజుల పాటు చికిత్సలు తీసుకోవాలి. ఆక్సిజన్‌ సాచ్యురేషన్‌, ఇతర లక్షణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలి. ఏం చేస్తే బాగుంటుందో వైద్యుల సలహాలు, సూచనలు తెలుసుకోవాలి.

No comments:

Post a Comment

Post Top Ad