2డీజీ ఔషధం ఆవిష్కరణ

Telugu Lo Computer
0

 

డీఆర్డిఓ అభివృద్ధి చేసిన 2-డియాక్సీ, డి-గ్లూకోజ్ (2డీజీ) మందు వినియోగానికి ఈ రోజు జరిగిన ఒక కార్యక్రంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ తొలి బ్యాచ్ ని    కేంద్ర  ఆరోగ్య  శాఖ మంత్రి  హర్షవర్ధన్ కు అందజేశారు. హర్షవర్ధన్  వాటిని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాకు ఇచ్చారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ 2డీజీ ఔషధం కోవిడ్ రికవరీ సమయం తగ్గడమే కాక ఆక్సిజన్ అవసరం కూడా తగ్గుతుందన్నారు. కొరోనా మహమ్మారి పోరులో డిఆర్డిఓ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. 

10 వేల సాచెట్లను తొలివిడతలో అందుబాటులోకి తెచ్చారు. మలి విడతలో (మే 27, 28 తేదీలలో)  మరిన్ని సాచెట్లను విడుదల చేస్తామని , జూన్ నాటికి పూర్తి స్థాయిలో మార్కెట్లో అందుబాటులోకి వస్తాయని దీనిని తయారు చేసే డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ తెలియజేసింది. అయితే దేని ధరను డీఆర్డీఓ ఇంకా నిర్ణియించలేదు. కరోనా కట్టడికి ఏడాదిపాటు శ్రమించి డీఆర్డీఓ  ఈ మందును తీసుకువచ్చింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)