నానో ఫైబర్ ఫిల్టర్స్ తో 100% అడ్డుకట్ట!

Telugu Lo Computer
0

 

మాస్కులు వాడటం వలన శ్వాసించడం ఇబ్బందిగా ఉండటంతో మాస్క్ ను క్రిందికి పైకి లాగడం చేసుతున్నారు. దాని వలన వైరస్ మనలో చొరబడటానికి మనమే ఆస్కారం కల్పించిన వారమౌతున్నాము. అయినా  మాస్క్ లు పూర్తి స్థాయిలో అడ్డుకోలేవని (66%, 75%, 98%) నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రో స్పిన్నింగ్ ప్రక్రియతో తయారు చేసే మాస్క్ లను ధరిస్తే శ్వాస తీసుకోవడం కూడా సులభంగా ఉంటుందంట!. 

గాలి తుంపర్ల ద్వారా వ్యాపించే కరోనా వైరస్ ను నానో ఫైబర్ ఫిల్టర్స్ పూర్తి స్థాయిలో అడ్డుకోగలవాని అమెరికాలోని యూసీ రివర్ సైడ్, ది జార్జి వాషింగ్టన్ వర్సటీ ఇంజినీరింగ్ పరిశోధకులు తాజా పరిశోధనలో రూఢీ చేశారు. 

తల వెంట్రుకుల మందంలో 167 భాగమంత సన్నగా ఉండే స్పన్ దారాల గుండా ఒక్క చుక్క ద్రవ రూప పాలివినిలిడెన్ ప్లోరైడ్ ను హెచ్చు స్థాయి విద్యుత్ ని ప్రసరింప ద్వారా నానో ఫైబర్ ఫిల్టర్స్ ను తయారు చేసినట్లు వారు తెలియజేశారు. ఎలక్ట్రో స్పిన్నింగ్ గా పిలిచే ఈ ప్రక్రియ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియని, మాస్క ల తయారీలో, వాయు నియంత్రణ వ్యవస్థలో భారీగా వినియోగించటానికి అనువుగా ఉంటుందన్నారు. ఎలక్ట్రో స్పిన్నింగ్ ప్రక్రియతో తయారు చేసే మాస్క్ లను ధరిస్తే శ్వాస తీసుకోవడం కూడా సులభంగా ఉండటమే కాక, 99.9% కంటే ఎక్కువగా వైరస్ ను అడ్డుకుంటున్నదని చెబుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)