10 మీటర్ల వరకు ప్రమాదఘంటికలు !

Telugu Lo Computer
0

 

గాలి ద్వారా వైరస్ ఒకరి నుండి మరొకరికి సోకుంతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో గాలిలో వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వెంటిలేషన్ పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ లు, భౌతిక దూరం, శానిటైజర్లతో పాటు, ఇండోర్లో గాలి, వెలుతురు సరిగ్గా ఉండేటట్లు చూసుకోవాలని అంటున్నారు. సాధారణముగా ఇంటిలో ఉండే తలుపులు, కిటికీలు ద్వారా దుర్వాసనలు మాత్రమే పోతాయి. అదే ప్రాంతంలో ఫ్యాన్ కూడా అమరిస్తే వైరస్ గాలి కూడా బయటికి పోయి ప్రమాదం తగ్గుతుంది.  వైరస్ ఆట కట్టించడానికి నిపుణుల బృందం ఈ క్రింది సూచనలు చేసింది. 


* దగ్గడం, తుమ్మడం, శ్వాస తీసుకోవడం, మాట్లాడడం, పాటలు పాడడం చేస్తున్నప్పుడు కరోనా సోకినా వ్యక్తి గొంతు, ముక్కు నుండి వైరస్ కణాలు బయటకు విడుదలవుతాయి. ఇంటి లోపల నేల, తలుపులు, హ్యాండిల్స్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. తరుచూ చేతులను సబ్బు, శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి. 

 *  చిన్న చిన్న తుంపర్లు (ఏరోసెల్స్) గాలిలో 10 మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. ఎప్పుడు మూసివుంచే గదులలో ప్రమాదకరంగా మారుతాయి. వీటి ద్వారానే గాలి నుంచి వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఇంటిలోకి గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేటట్లు చూసుకోవాలి. కిటికీలు, తలుపులు ఎప్పుడు తెరిచి ఉంచుకోవాలి. కిటికీల వద్ద ఫ్యాన్ అమర్చుకొంటే ఇంకా మంచిది. 

* కార్యాలయాలలో ఏసీ లు వేయడం, తలుపులు, కిటికీలు మూసివేస్తారు. దానివలన వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. తలుపులు, కిటికీలు తెరచి ఉంచాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. 

* రెండు మాస్క్ల  వాడకం తప్పనిసరి. ఒకటి సర్జికల్, రెండోది గుడ్డది  వాడాలి. సర్జికల్ మాస్క్ల ఒకటే వాడితే ఒకసారి మాత్రమే వాడాలి. కలిపి వాడేటట్లయితే 5సార్లు ఉపయోగించవచ్చు. పెట్టుకున్న ప్రతిసారి దానిని ఎండలో ఆరబెట్టుకోవాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)