రైతు పాదయాత్ర పై బొత్స వివాదాస్పద వ్యాఖ్యలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులపై మరోసారి ప్రభుత్వ వైఖరిని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానమన్నారు.  29 గ్రామాలు, ఒక ప్రాంతం, ఒక వర్గం కోసం ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. 2019 నాటికి లక్ష 9 వేలు కోట్లు రాజధానికి గత ప్రభుత్వం ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. శివరామకృష్ణన్ కమిటీ కి గత ప్రభుత్వం కో ఆపరేట్ చేయలేదు. ఆ కమిటీ గత ప్రభుత్వం నిర్ణయం సరైనది కాదని చెప్పిందన్నారు. రాష్ట్ర సంపద ల్యాండ్ పూలింగ్ పేరుతో 29 గ్రామాల్లో పెట్టారు. ల్యాండ్ ఇచ్చిన వారికి ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం చేస్తాము. మనం కళ్ళు తెరిచే టైం కి రాష్ట్ర విభజన జరిగిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దొంగలు, దోపిడిదారులు పాద యాత్ర గా వస్తున్నారు. రాష్ట్రంలో కుట్ర జరుగుతుంది..జరుగుతున్న దోపిడీని అడ్డుకోవాలి. చంద్రబాబు కి , లోకేష్ కి జై అని పాదయాత్ర మొదలు పెట్టారు. రాష్ట్ర ప్రజలు కష్టాన్ని 29 గ్రామాల గోతులలో పోయాలి అంటున్నారు. తెలుగుదేశం ప్రజలు అభిమానం కోల్పోయిన పార్టీ, వారి ముసుగులో పాదయాత్ర చేస్తున్నారని విమర్శించారు. ఐదు కోట్ల ప్రజల పరిస్థితి ఏంటి ? మన దేవుడి దగ్గరకి వచ్చి శాపాలు పెడతారా? ఇదెక్కడి చోద్యం. 29 గ్రామాలు రియల్ ఎస్టేట్ కోసం, ఒక పార్టీ మనుగడ కోసం యాత్ర చేస్తున్నారు. పాద యాత్ర కావాలంటే ఐదు నిమిషాలు చాలని కానీ అది సాంప్రదాయం కాదని చెప్తే నా మాటలు వక్రీకరించారు. ఇక్కడే రాజధాని కడతామని అగ్రిమెంట్ ఇవ్వలేదు. ఐదు కోట్ల ప్రజలు డబ్బులు ఆ మట్టి లో పోస్తే 29 గ్రామాల నుంచి మీరు సంపాదిస్తారా? రైతులు ముసుగులో టీ డీ పీ చేస్తున్న పాదయాత్ర కి బుద్ధి చెప్పాలన్నారు. పాదయాత్ర ఒక్క అడుగు ముందుకు వేయకుండా అడ్డుకోవాలి. దుష్ట శక్తులు, దుర్మార్గులు ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు రాజధాని విశాఖ కి వ్యతిరేకంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. బీజేపీ నేతలు ద్వంద వైఖరి వహిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)