ముంబయిలో నిలిచిన బస్సు, రైలు సర్వీసులు

Telugu Lo Computer
0


మహారాష్ట్రను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముంబయిలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్‌ సర్వీస్‌లపై కూడా ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. మహారాష్ట్రకు రెడ్‌, ఆరెంజ్‌ అలెర్ట్‌లు ప్రకటించింది.ముఖ్యంగా రారుగడ్‌, రతన్‌గిరి జిల్లాలతో పాటు మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో బుధవారం ఉదయం 8 గంటల సమయం నాటికి ముంబయి నగరంలో సగటున 107మి.మీ వర్షపాతం నమోదైందని అధికారులు తెలిపారు. తూరు. పశ్చిమ శివారు ప్రాంతాల్లో వరుసగా 172 మి.మీ, 152 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సతారా జిల్లాలోని ప్రతాప్‌గడ్‌ కోట సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. వరదల ధాటికి థానేకు చెందిన ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)