స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్ ?

Telugu Lo Computer
0


స్వలింగ సంపర్కంతోనే మంకీపాక్స్ సోకే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మంకీపాక్స్ వైరస్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉన్నవారు 21 రోజులపాటు ఐసోలేషన్ లో ఉండాలని బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ సూచించింది. మంకీపాక్స్ వ్యాధి సోకిన వారితో ఇంట్లో గానీ, వెలుపల గానీ సన్నిహితంగా మెలిగిన వారు తాము ఎప్పుడెప్పుడు? ఎక్కడెక్కడ? ఎవరెవరిని కలిసిన విషయాలను అధికారులకు తెలియజేయాలని తెలిపింది. వృద్ధులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు, గర్భిణులు, 12 ఏళ్లలోపు బాల బాలికలకు సమీపంగా వెళ్లరాదని వెల్లడించింది. ఆఫ్రికా మధ్య, పశ్చిమ ప్రాంతాల్లో కోతుల్లో కనిపించే ఈ వ్యాధి.. అక్కడి నుంచి ఐరోపా, బ్రిటన్ లకు పాకింది. బ్రిటన్ లో 20, ఐరోపా, అమెరికా, కెనడా, ఇజ్రాయెల్, ఆస్ట్రేలియా దేశాల్లో 80 మంకీపాక్స్ కేసులు నమోదు అయ్యాయి. ముఖ్యంగా కోతుల్లోనే కనపించే ఈ వైరస్ వ్యాధి అంత తేలిగ్గా మనుషులకు సంక్రమించదు. వ్యాధి పీడితులకు అత్యంత సన్నిహితంగా మెలిగిన వారికే త్వరగా సోకుతుంది. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా వైరస్ సోకుతుంది. బెల్జియంలో జరిగిన రెండు రేవ్ పార్టీల్లో పాల్గొన్న స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులైన పురుషులకు మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించి ఉండవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహాదారు డాక్టర్ డేవిడ్ హైమాన్ అభిప్రాయపడ్డారు. బ్రిటన్ లో కూడా ఇంతవరకు కనుగొన్న కేసుల్లో అధిక భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించాయి. అలాంటి వారితో లైంగిక క్రియ జరిపినా, పీపీఈ సూట్లు లేకుండా వారి దుప్పట్లు మార్చినా, ఇతరత్రా వెళ్లిన మంకీపాక్స్ వ్యాధి సోకుతుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)