రుద్రంగిలో అత్యధిక వర్షపాతం

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణాలో నిన్న రాత్రి నుండి వర్షాలు కురుస్తున్నాయి. ఈరోజు ఉదయం 7గంటల వరకు  అత్యధికంగా సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 13.7 సెంటీ మీటర్ల వర్షపాతం న‌మోద‌యింది. రామగుండం రీజీయన్‌లో బొగ్గు ఉత్ప‌త్తి నిలిచిపోయింది. అలాగే, ఈ రోజు నల్ల‌గొండ, సూర్యాపేట, కామారెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, జనగామ, మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని, ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అల్పపీడనం కారణంగా తెలంగాణ, కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రేపు కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖా తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)