ప్రశాంత జీవనానికి పది సూత్రాలు!

Telugu Lo Computer
0

తన జీవిత కాలం  సుప్రీం కోర్టులో ఫ్యామిలీ డిస్ప్యూట్ కేసులు చూసిన 
ఒక జడ్జిగారి అనుభవ సారం! 
  
👉 ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని వేరే       ఇంట్లో ఉండమనండి .
(మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి .) 

👉 మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్ గా                  చూడండి అంతే తప్ప,  మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట            కూడా అనవద్దు .
 (అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది .) 

👉 మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు , అనవసరం కూడా.
 
👉 ఒకవేళ మీరు తప్పనిసరై కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి .వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు. ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరితే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి .మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి .

👉 మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.

👉 మీ మనుమలు, మనుమరాలు  పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం . 

👉 మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు అలా ఆశించకండి . ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి.

👉 మీ మిగతా జీవితం కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోకండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి .
 
👉 మీ మిగిలిన జీవితం   మీరు ఎంత హాయిగా గడుపుకుంటారో లేదో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి. మీ కొడుకు-కోడలు సంపాదన మీద మీరు ఆధారపడకుండా ఉంటే మంచిది. గొడవలు అక్కడే వస్తాయి. వాళ్ళను ఎంత స్వేచ్ఛగా ఉంచుతామో మనం అంత ఆనందంగా ఉంటాము.
 
👉 మనుమరాలు, మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం .

 ఇలా ఉంటేనే జీవిత కాలం సంతోషంగా ఉంటాం .

Post a Comment

0Comments

Post a Comment (0)